ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

పుట్టింటి పసుపు, కుంకుమ అందుకున్న తిరుపతమ్మ- అంగరంగ వైభవంగా బండ్ల ఉత్సవం - Thirupatamma Bandla Utsavam - THIRUPATAMMA BANDLA UTSAVAM

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 29, 2024, 5:02 PM IST

Thirupatamma Bandla Utsavam NTR District : ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట పెనుగంచిప్రోలు తిరుపతమ్మ అమ్మవారి తిరునాళ్లళఓ భాగంగా ప్రధాన ఘట్టమైన పుట్టింటి పసుపు కుంకుమ బండ్లు ఉత్సవం గురువారం రాత్రి వైభవంగా సాగింది. అనిగండ్లపాడు నుంచి పెనుగంచిప్రోలు వరకు సాగిన బండ్ల ఉత్సవంలో భక్తులు వేలాదిగా పాల్గొని అమ్మవారికి జేజేలు పలికారు. అనిగండ్లపాడు లోని అమ్మవారి పుట్టిల్లు కొల్లా శ్రీనివాసరావు ఇంటి నుంచి పసుపు కుంకుమలు అందుకున్నారు. ఆలయ అధికారులు విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించిన బండ్లపై ఉంచి భారీ ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి తీసుకువచ్చారు. 

కొల్ల శ్రీనివాసరావు దంపతులు పసుపు కుంకుమలను ఆలయ ప్రధాన అర్చకుడు గోపి బాబుకు అందజేయగా అమ్మవారికి సమర్పించడంతో వేడుక ముగిసింది. పసుపు కుంకుమ బండిని అనుసరిస్తూ అనిగండ్లపాడు నుంచి వందలాది బండ్లు పెనుగంచిప్రోలు వచ్చి ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేసిన అనంతరం తిరిగి వెళ్ళాయి. ఎన్నికల కోడ్ నేపథ్యంలో డీజేలు, పార్టీ జెండాల రంగులను పోలీసులు ముందస్తుగానే నిషేధించారు. నందిగామ ఏసీపీ రవి కిరణ్ నేతృత్వంలో భారీ పోలీస్ బందోబస్తు మధ్య వేడుక ప్రశాంతంగా ముగిసింది. 

ABOUT THE AUTHOR

...view details