ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న టీడీపీ అభ్యర్థి - ఓటు వేయాలని అభ్యర్థన - TDP Candidates ELECTION Campaign - TDP CANDIDATES ELECTION CAMPAIGN

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 28, 2024, 3:28 PM IST

TDP Candidates Election Campaign : ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార, ప్రతిపక్ష పార్టీలు  ప్రచారాలతో దూసుకుపోతున్నాయి. టీడీపీ అభ్యర్థులు ఇంటింటికి తిరుగుతూ పార్టీ చేపట్టబోయే అభివృద్ది కార్యక్రమాలు, తెలుగుదేశం సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తున్నారు. ఇంటింటికి తిరిగి తమ పార్టీ చేపట్టే కార్యక్రమాలను నేతలు ప్రజలకు వివరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పరిష్కరిస్తామని భరోసా కల్పిస్తూ ముందుకు సాగుతున్నారు.

Dhone Candidate Kotla Jaya Surya Prakash Reddy Election Campaign : నంద్యాల జిల్లా డోన్ తెలుగుదేశం పార్టీ అభ్యర్ధిగా కోట్ల జయ సూర్య ప్రకాశ్ రెడ్డిని అధిష్టానం ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ రోజు నుంచి విస్తృతంగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఇంటింటికి తిరుగుతూ, అందరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనని గెలిపించాలని ఓటర్లను కోరారు. మహిళలకు, వృద్ధులకు సూపర్ సిక్స్ పథకాల గురించి వివరించారు. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి చేసుకుంటేనే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని కోట్ల కాలనీవాసులకు తెలియజేశారు. డోన్ పట్టణంలోని 11 వ వార్డ్​లో కోట్లతో పాటు, రాష్ట్ర కార్యదర్శి నాగేశ్వర యాదవ్, నాయకులు ప్రచారంలో పాల్గొన్నారు. 

ABOUT THE AUTHOR

...view details