ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

స్కూల్​కు వెళ్లాలంటే టీచర్లు సాహసం చేయాల్సిందే - ఎందుకంటే ! - TEACHERS PROBLEMS TO GO TO SCHOOL - TEACHERS PROBLEMS TO GO TO SCHOOL

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 2, 2024, 12:48 PM IST

Updated : Aug 2, 2024, 12:55 PM IST

Problem of Teachers to Go to Bonthuvalasa School in Allur District : ఆ పాఠశాలకు వెళ్లాలంటే ఉపాధ్యాయులు కర్ర పట్టకుని వెళ్లాల్సిందే. పిల్లల్ని కొట్టడానికి అనుకుంటే పొరపాటే. వాగు దాటడానికి కర్ర సాయమే దిక్కంటున్నారు మరి. వాగు ఉద్ధృతి పెరిగితే ప్రాణాలకు తెగించి దాటాల్సిందే. కర్ర చేత పట్టి వాగు దాటాల్సిందే అంటున్నారు టీచర్లు. పలువురు ఉద్యోగుల దుస్థితి కూడా ఇలాగే ఉంది. 

అల్లూరి జిల్లా G.K. మండలం బొంతువలస పాఠశాలకు వెళ్లాలంటే సాహసం చేయాల్సి వస్తోందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో గిరిజన ఏజెన్సీ గుడాల్లో వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. టీచర్లు కర్ర సాయంతో వాగు దాటుతూ సాహసం చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. బయోమెట్రిక్ వేయాలంటే సకాలంలో పాఠశాలలకు వెళ్లాల్సిందే. దాని కోసం ఉపాధ్యాయులు సాహసాలు చేస్తూ పరుగులు పెడుతున్నారు. వర్షాలు పడిన ప్రతిసారీ టీచర్లు, ఆరోగ్య కార్యకర్తలు సాహసాలు చేయాల్సి వస్తోందని ఆవేదన చెందారు. గిరిజన ప్రాంతాలకు వెళ్లే తమ వంటి ఉద్యోగుల ప్రయాణానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 

Last Updated : Aug 2, 2024, 12:55 PM IST

ABOUT THE AUTHOR

...view details