ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఘోర పరాజయానికి ఆత్మవిమర్శ చేసుకోకుండా ప్రజలపై నిందలేల!: వర్ల రామయ్య - TDP Varla Ramaiah Fire on YSRCP - TDP VARLA RAMAIAH FIRE ON YSRCP

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 7, 2024, 7:54 PM IST

TDP Varla Ramaiah Fire on YSRCP: ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘోర పరాజయానికి జగన్ చేసిన అరాచకాలే కారణమని తెలుగుదేశం నేత వర్ల రామయ్య అన్నారు. ఓటమికి గల కారణాలపై జగన్ ఆత్మపరిశీలన చేసుకోకుండా ప్రజలపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ పాలనలో దళితులపై విపరీతంగా దాడులు జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమపై జరిగిన హింసాకాండ, హత్యలు, అత్యాచారాలను దళిత బిడ్డలు మరిచిపోలేదన్నారు. మాచర్లను వైఎస్సార్సీపీ నేతలు రావణకాష్ఠంగా మార్చిన తీరునూ జనం మరచిపోలేదని వర్ల రామయ్య తెలిపారు.

"వైఎస్సార్సీపీ ఘోర పరాజయానికి జగన్‌ చేసిన అరాచకాలే కారణం. ఓటమికి గల కారణాలపై జగన్మోహన్ రెడ్డి ఆత్మపరిశీలన చేసుకోకుండా ప్రజలపై నిందలు వేస్తున్నారు.  వైఎస్సార్సీపీ పాలనలో  దళితులపై విపరీతంగా దాడులు జరిగాయి. తమపై జరిగిన హింసాకాండ, హత్యలు, అత్యాచారాలను దళిత బిడ్డలు మరిచిపోలేదు. మాచర్లను వైఎస్సార్సీపీ నేతలు రావణకాష్ఠంగా మార్చిన తీరునూ జనం మరచిపోలేదు." - వర్ల రామయ్య, తెలుగుదేశం నేత 

ABOUT THE AUTHOR

...view details