ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

రాష్ట్రస్థాయి మహిళా ప్రో కబడ్డీ పోటీల్లో విజేతగా విజయనగరం జిల్లా జట్టు - మహిళా ప్రో కబడ్డీ పోటీలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 20, 2024, 5:04 PM IST

TDP State Level Women Pro Kabaddi Competitions: అనకాపల్లి జిల్లా మునగపాక మండలం నాగులాపల్లిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి మహిళా ప్రో కబడ్డీ పోటీల్లో విజయనగరం జిల్లా జట్టు విజేతగా నిలిచింది. మాజీ ఎంపీ పెతకంశెట్టి అప్పలనర్సింహం జయంతి(Former MP Petakamshetty Appalanarsimham Jayanti) సందర్భంగా నారా లోకేశ్‌ యువగళం విజయోత్సవ కప్‌ పోటీలు(Nara Lokesh Yuvagalam Vijayotsava Cup Competitions) మూడు రోజులపాటు నిర్వహించారు. ఈ నెల 17వ తేదీ నుంచి 19 వరకు సాయంత్రం 5 నుంచి రాత్రి 10 గంటల వరకు ఫ్లడ్‌లైట్ల వెలుగుల్లో నిర్వహించిన ఈ పోటీల్లో రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన మహిళా క్రీడాకారులు(Female Athletes) పాల్గొన్నారు. 

పురుషుల జిల్లా స్థాయి కబడ్డీ పోటీల్లో గంగవరం జట్టు(Gangavaram Team) విజేతగా నిలిచింది. మునగపాక మండల టీడీపీ అధ్యక్షుడు దొడ్డి శ్రీనివాసరావు(TDP President Doddi Srinivasa Rao) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలను జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు(Janasena State General Secretary Nagababu) హాజరై ప్రత్యక్షంగా తిలకించారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు విశాఖపట్నం ఎమ్మెల్యే గణబాబు(Visakhapatnam MLA Ganababu), ఎలమంచిలి నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్​ ప్రగడ నాగేశ్వరరావు(Elamanchili TDP Incharge Pragada Nageswara Rao) చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details