ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

కృష్ణపట్నం కంటైనర్ టెర్మినల్ మూతపడిపోతుంటే జగన్‌ ఏం చేస్తున్నారు: సోమిరెడ్డి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 20, 2024, 5:47 PM IST

TDP Somireddy about Krishnapatnam Container Terminal: రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలతో కృష్ణపట్నం కంటైనర్ టెర్మినల్ త్వరలో మూతపడనుందని మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మండిపడ్డారు. నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం కంటైనర్ టెర్మినల్ మూతపడిపోనుందని సోమిరెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 24, 25 తేదీల్లో వచ్చే చివరి వెజల్ తరువాత పోర్టు కంటైనర్ కార్గో మూత పడనుందని తెలిపారు. నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల కారణంగా రాష్ట్రానికి వచ్చే వెయ్యి కోట్లు ఆదాయం నిలిచిపోనుందని అన్నారు. తమిళనాడు కాటుపల్లిలోని అదాని పోర్టుకి కార్గో టెర్మినల్ ని తరలిస్తున్నారన్న సోమిరెడ్డి, ఫలితంగా 10 వేల మంది ప్రతేక్షంగా, పరోక్షంగా ఉపాధి కోల్పోతారన్నారు. 

గతంలో కృష్ణపట్నం పోర్టు రావడానికి ముఖ్యకారణం చంద్రబాబు అని సోమిరెడ్డి చెప్పారు. దాదాపు పది వేలమంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కోల్పోతారని అన్నారు. ఆరు వేల ఎకరాలు ఎస్ఈజడ్ విలువైన భూములు నిర్వీర్యం అవుతాయని మండిపడ్డారు. ప్రజల దగ్గర తీసుకున్న విలువైన భూములు వెనక్కు ఇచ్చేయాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details