ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

పొత్తులో భాగంగానే పవన్ అభ్యర్థుల్ని ప్రకటించారు: బొండా ఉమా - Babu Surity Bhavishattu Gaurantee

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 27, 2024, 6:15 PM IST

TDP Polit Bureau Leader Bonda Fires On YSRCP: టీడీపీ- జనసేన పొత్తులో భాగంగా ముందుగా అనుకున్న రాజానగరం, రాజోలు అసెంబ్లీ స్థానాలకే జనసేన అధినేత పవన్​ కల్యాణ్​ అభ్యర్థుల్ని ప్రకటించారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు తెలిపారు. పవన్ ప్రకటనపై టీడీపీకి అభ్యంతరం లేదని, పొత్తులో అభిప్రాయభేదాలకు తావులేదని స్పష్టం చేశారు. రాష్ట్రం, ప్రజల ప్రయోజనాల కోసమే టీడీపీ- జనసేన పొత్తు పెట్టుకున్నాయని, జగన్​ను రాష్ట్రం నుంచి తరిమి కొట్టడానికే చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఒక్కటయ్యారని తెలిపారు. 

Bonda Uma Maheswarrao Babu Surity Bhavishattu Gaurantee Program: శుక్రవారం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో బాబు ష్యూరిటీ- భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం బొండా నిర్వహించారు. ఈ సందర్భంగా బొండా మాట్లాడుతూ జనసేన, తెలుగుదేశం పొత్తుపై వైఎస్సార్సీపీ నాయకులు ఫ్యాంట్లు తడుపుకుంటున్నారని విమర్శించారు. పొత్తులపై తాము స్పందించాల్సింది పోయి వైసీపీ నాయకులు స్పందించడం వారి దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ABOUT THE AUTHOR

...view details