మంగళగిరిలో ఉత్సాహంగా ముగిసిన బ్యాడ్మింటన్ పోటీలు - AP Political news
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 4, 2024, 12:01 PM IST
TDP Nara Lokesh Badminton League Finals: గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని యువతకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(TDP National General Secretary Nara Lokesh) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బ్యాడ్మింటన్ పోటీలు ఉత్సాహంగా ముగిశాయి. ఆఖరి మ్యాచ్(Final Match)లో జితేంద్ర జోడి, చంద్రశేఖర్ రెడ్డిపై జోడిపై ఏకపక్ష విజయం సాధించింది. మొదటి రెండు సెట్లను పవన్ కల్యాణ్, పూజిత్ జోడి 21-8, 21-13 గెలుచుకుని టైటిల్(Title) సాధించింది.
TDP Badminton Competition Finals at Mangalagiri: విజయం సాధించిన జట్టు(Winning Team)కు లక్ష రూపాయల నగదును, రన్నరప్‌గా నిలిచిన జట్టు((Runner up Team)కు 50వేల రూపాయల నగదు బహుమతి(Cash Prize)ని టీడీపీ నేతలు(TDP Leaders) అందజేశారు. నియోజకవర్గంలోని యువత కోసం నారా లోకేశ్ ఇప్పటికే వాలీబాల్(Volleyball), క్రికెట్ పోటీలు(Cricket Competitions) నిర్వహించారని గుర్తుచేసిన టీడీపీ నేతలు ఈ సారి ఏర్పాటు చేసిన బ్యాడ్మింటన్ పోటీలు(Badminton Competitions) ఉత్సాహంగా సాగాయన్నారు.