ETV Bharat / state

న్యూ ఇయర్​ వేడుకలకు గోవా వెళ్లాడు- శవమై ఇంటికి చేరాడు - AP TOURIST KILLED IN GOA

నూతన సంవత్సర వేడుకలకు గోవా వెళ్లిన తాడేపల్లిగూడెం యువకుడు - అక్కడ గొడవలో దారుణ హత్య

tourist_killed_in_drunken_brawl_in_goa
tourist_killed_in_drunken_brawl_in_goa (ETV Bharat)
author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 3, 2025, 8:57 AM IST

Tourist killed in Drunken Brawl in Goa : న్యూ ఇయర్​ సెలబ్రేషన్స్​ వారి జీవితాల్లో విషాదం నింపింది. సరదాగా గడుపుదామని వెళ్లిన టూర్​ ప్రాణాలు తీసింది. కన్న వారికి కడుపుకోత మిగిల్చింది. నూతన సంవత్సర వేడుకలకు గోవా వెళ్లిన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం యువకుడు దారుణ హత్యకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

బంధువులు తెలిపిన వివరాల మేరకు స్థానిక ఆరో వార్డుకు చెందిన బొల్లా రవితేజ(28) హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. నూతన సంవత్సర వేడుకలకు ఏడుగురు స్నేహితులతో కలిసి గత శనివారం హైదరాబాద్‌ నుంచి గోవా వెళ్లారు. సోమవారం రాత్రి కలంగుట్‌ బీచ్‌లో వీరంతా సరదాగా గడిపి పక్కనే ఉన్న మరీనా బీచ్‌షాక్‌ అనే రెస్టారెంట్‌కు భోజనానికి వెళ్లారు.

బిల్లులో ధరలు అధికంగా ఉన్నాయని వీరితో పాటు వచ్చిన ఓ యువతి నిర్వాహకుడిని ప్రశ్నించారు. దీంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో రెస్టారెంట్‌ యజమాని కుమారుడు సుబెట్‌ సిల్వేరా ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. దీంతో ఘర్షణ జరిగింది. రెస్టారెంట్‌లో పనిచేసే కొందరు రవితేజపై కర్రలతో దాడి చేశారు.

ఫ్రెండ్ న్యూ ఇయర్ విషెస్​​ చెప్పలేదని విద్యార్థిని ఆత్మహత్య

తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని స్వస్థలానికి పంపేందుకు ఇబ్బందులు తలెత్తడంతో రాష్ట్రప్రభుత్వం జోక్యం చేసుకుని ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి తెప్పించింది. అక్కడి నుంచి తాడేపల్లిగూడెంలోని నివాసానికి గురువారం చేరుకొంది.

నూతన సంవత్సర వేడుకల్లో విషాదం- మైపాడు​ బీచ్​ వద్ద యువకుడి మృతి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.