ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

రాష్ట్రం అభివృద్ధి చెందితే అప్పులు తగ్గుతాయనే విషయం సీఎం జగన్‌కు తెలియదు: యనమల - TDP Yanamala on YSRCP Manifesto

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 28, 2024, 2:05 PM IST

TDP Leader Yanamala Comments on YSRCP Manifesto: సీఎం జగన్‌ విడుదల చేసిన మేనిఫెస్టో ప్రజలకు మొండిచేయి చూపించే విధంగా ఉందని తెలుగుదేశం సీనియర్‌ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. రాష్ట్ర సంపద పెంచాలన్న ఉద్దేశం జగన్‌కు లేదని విమర్శించారు. ఐదేళ్లుగా దాదాపు 14 లక్షల కోట్ల రూపాయల అప్పులు చేశారన్న ఆయన రాష్ట్రం అభివృద్ధి చెందితే అప్పులు తగ్గుతాయనే విషయం సీఎం జగన్‌కు తెలియదని ఎద్దేవా చేశారు.

"సీఎం జగన్‌ కొత్త సారాంశం లేని మేనిఫెస్టోను విడుదల చేశారు. 2019లో వైఎస్సార్సీపీ ఇచ్చిన మేనిఫెస్టోలో ఒక్కటి కూడా నెరవేర్చలేదు. రాష్ట్ర సంపద పెంచాలన్న ఉద్దేశం జగన్‌కు లేదు. ఐదేళ్లుగా దాదాపు రూ.14 లక్షల కోట్లు అప్పులు చేశారు. అప్పులు తీర్చాలంటే ఏడాదికి లక్ష కోట్లు ఖర్చు పెట్టాలి. రాష్ట్రం అభివృద్ధి చెందితే అప్పులు తగ్గుతాయనే విషయం జగన్‌కు తెలీదు. రాష్ట్ర అభివృద్ధిని వైఎస్సార్సీపీ ప్రభుత్వం సర్వనాశనం చేసింది. జగన్‌ సర్కారు పేదరికం తగ్గించడానికి ఏ చర్యలు తీసుకోలేదు." - యనమల రామకృష్ణుడు, టీడీపీ సీనియర్‌ నేత

ABOUT THE AUTHOR

...view details