ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

రివర్స్‌ టెండరింగ్‌ పేరిట టీటీడీని భ్రష్టుపట్టించారు: టీడీపీ నేత విజయ్‌కుమార్‌ - TDP Vijay Kumar on Jagan - TDP VIJAY KUMAR ON JAGAN

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 5, 2024, 4:36 PM IST

TDP Leader Vijay Kumar Comments on Jagan Regarding Tirumala Ghee Issue: రివర్స్‌ టెండరింగ్ పేరిట వైఎస్సార్​సీపీ నేతలు టీటీడీని దోచుకున్నారని టీడీపీ నేత నీలాయపాలెం విజయ్‌కుమార్‌ విమర్శించారు. ఆలయానికి నెయ్యి సరఫరా చేసేందుకు రాష్ట్రంలో ప్రముఖ డెయిరీలు ఉన్నా కేవలం కాసుల కక్కుర్తి కోసమే ఉత్తరాదిలో ట్రేడింగ్ చేసే సంస్థలకు కాంట్రాక్ట్ కట్టబెట్టారని అన్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కేవలం కొన్ని సంస్థలకే ఏళ్లతరబడి అవకాశం కల్పించారని విమర్శించారు. 

అంతే కాకుండా జగన్ హయాంలో రివర్స్ టెండరింగ్ పేరుతో నెయ్యి నాణ్యతను భ్రష్టు పట్టించారని నీలాయపాలెం విజయ్‌కుమార్ విమర్శించారు. పాల ధర పెరుగుతుంటే నెయ్యి ధర ఎందుకు తగ్గుతుందని ప్రశ్నించారు. నెయ్యి సరఫరాకు సంబంధించి టెండర్ విధానంలో మొత్తం 9 సంస్థలు బిడ్లు దాఖలు చేశాయని వెల్లడించారు. అందులో ఏఆర్ డెయిరీ సామర్ధ్యం పక్క సంస్థల నుంచి నెయ్యి తెచ్చుకునే పరిస్థితి అని వివరించారు.

ABOUT THE AUTHOR

...view details