LIVE: నిమ్మకు నీరెత్తినట్లుగా జగన్ రెడ్డి కేసుల విచారణ- టీడీపీ వర్ల రామయ్య మీడియా సమావేశం లైవ్ - TDP Leader Varla Ramaiah Live
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 2, 2024, 1:28 PM IST
|Updated : Feb 2, 2024, 1:35 PM IST
TDP Leader Varla Ramaiah Press Meet Live: తనపై ఉన్న కేసుల విచారణ ముంచుకొస్తుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిలో కలవరం మొదలయ్యిందని.. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆరోపించారు. కేసుల కంగారులో సీఎం జగన్ తానేం నిర్ణయాలు తీసుకుంటున్నారో తనకే తెలియని అయోమయస్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ ఆస్తులన్నీ ఆయన బినామీల పేరుతో ఉన్నాయని, ఇథోపియా ఇన్‌ఫ్రా, కేప్‌స్టోన్ ఇన్‌ఫ్రా, హరీశ్ ఇన్‌ఫ్రాల బినామీ కంపెనీలని వర్ల ఆరోపించారు. తాడేపల్లిలోని నివాసం, బెంగుళూరులోని ప్యాలెస్‌లు జగన్ తన బినామీల పేరుతోనే ఉంచారని పేర్కొన్నారు. సీఎం జగన్‌పై బినామీ చట్టం కింద చర్యలు తీసుకోవాలని వర్ల డిమాండ్ చేశారు. ఈ క్రమంలో 2012లో సీబీఐ, ఈడీలు ఛార్జ్‌షీట్లు వేస్తే ఇప్పటివరకూ జగన్ రెడ్డి కేసు విచారణ సాగుతూనే ఉండటం సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధమన్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేత వర్ల రామయ్య మీడియా సమావేశం ప్రత్యక్షప్రసారం మీకోసం.