LIVE వైసీపీ పతనం, మంత్రి పెద్ది రెడ్డి ఓటమి ఖాయమైంది- టీడీపీ నేత వర్ల రామయ్య మీడియా సమావేశం ప్రత్యక్ష ప్రసారం - TDP Varla on Peddi Reddy Live
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 28, 2024, 4:11 PM IST
|Updated : Jan 28, 2024, 4:22 PM IST
TDP Leader Varla Ramaiah on Peddi Reddy Live: టీడీపీ అధినేత చంద్రబాబుపై రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ నేతలు మండిపడ్డారు. అవినీతి సొమ్ముతో మదించిన రాజకీయ వ్యాపారి పెద్దిరెడ్డికి చంద్రబాబును విమర్శించే నైతిక అర్హత లేదని దుయ్యబట్టారు. కాగా సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పాలనలో తుడిచి కొట్టుకు పోతామన్న భయాందోళనలో ఉన్న చంద్రబాబు కాంగ్రెస్ ముసుగులో షర్మిలమ్మను తీసుకొచ్చి అడ్డగోలు ఆరోపణలు చేయిస్తున్నారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యాఖ్యానించారు. అందుకే చంద్రబాబు అండ్‌కో, ఎల్లోమీడియా స్క్రిప్ట్ ప్రకారమే ఆమె విమర్శలు చేస్తున్నారని, వాటిని ప్రజలు పట్టించుకోవడం లేదని అన్నారు.
తిరుపతిలోని పీఎల్‌ఆర్ కన్వెన్షన్ సెంటర్‌లో శనివారం మంత్రి పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త, తిరుపతి ఎంపీ గురుమూర్తి అధ్యక్షతన ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ సందర్భంగా "సిద్ధం" పోస్టర్‌ను వారు ఆవిష్కరించారు. అంతకుముందు మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ ''చంద్రబాబుకే గ్యారెంటీ లేదు, ఆయన హామీలకు ఉంటుందా? బాబు హామీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు'' అని అన్నారు. అంతటితో ఆగకుండా వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబు ఓటమి తప్పదని, అందుకే కుప్పంతోపాటు మరో నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేస్తారని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డిపై మండిపడుతున్న టీడీపీ నేత వర్ల రామయ్య మీడియా సమావేశం ప్రత్యక్ష ప్రసారం.