ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

బహిరంగ చర్చకు సిద్ధమా ? - ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డికి రామకృష్ణారెడ్డి సవాల్​ - టీడీపీ నేత రామకృష్ణారెడ్డి

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 29, 2024, 10:19 PM IST

TDP Leader Ramakrishna Challenge to YCP MLA Suryanarayana Reddy: అనపర్తి వైసీపీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి అవినీతి అంశాలపై చర్చకు వస్తారో లేదో స్పష్టత ఇవ్వాలని తెలుగుదేశం నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి డిమాండ్‌ చేశారు. అవినీతి అంశాలపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించకపోతే ఎమ్మెల్యే అవినీతి చేసినట్లు అంగీకరించినట్లుగా భావిస్తామన్నారు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం రామవరంలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రామకృష్ణా రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి అవినీతి అంశాలపై చర్చకు వస్తారో లేదో స్పష్టత ఇవ్వాలని నల్లమిల్లి ప్రశ్నించారు. 

ఎమ్మెల్యే చర్చకు సిద్ధమా, సత్య ప్రమాణానికి సిద్ధమా, యుద్ధానికి సిద్ధమా ? దేనికైనా తాము సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు. చర్చకు వచ్చేందుకు ఎందుకు వెనకడుకు వేస్తున్నారని ఆయన విమర్శించారు. తాము సిద్ధమే ? ఎమ్మెల్యే సిద్ధమా ? అని పదే పదే అనటానికి కారణం నియోజకవర్గంలో ఆయన చేసిన అవినీతి అక్రమాలపై బహిరంగ లేఖను సిద్ధం చేశామని పేర్కొన్నారు. బహిరంగ చర్చకు ఎమ్మెల్యే ఎందుకు చర్చకు రావట్లేదో తెలపాలని నల్లమిల్లి అన్నారు. 

ABOUT THE AUTHOR

...view details