LIVE: గులకరాయి కేసులో రిమాండ్ రిపోర్ట్ సాక్షిగా వైసీపీ కుట్రలు - పట్టాభి మీడియా సమావేశం - Pattabhi ram live - PATTABHI RAM LIVE
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 20, 2024, 12:25 PM IST
|Updated : Apr 20, 2024, 12:42 PM IST
LIVE: సీఎం జగన్‌పై గులకరాయి విసిరిన కేసులో విజయవాడ పోలీసులు గురువారం అరెస్టు చూపించారు. అజిత్‌సింగ్‌నగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ అలియాస్ సత్తిని నిందితుడిగా తేల్చారు. ఏ1గా సతీష్‌ను చూపించిన పోలీసులు ఏ2 ప్రోద్బలంతో జగన్‌పైకి రాయి విసిరాడని చెబుతున్నారు. కానీ అలా ప్రోత్సహించిన వ్యక్తి ఎవరన్నదీ తేల్చకుండానే కోర్టుకు రిమాండ్ రిపోర్టు సమర్పించారు. నిందితుడికి మే 2 వరకు 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఈ కేసులో ఎవరిని ఇరికించడానికి ఇదంతా చేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.ఏ2 ఏవరో? : సీఎంపై రాయి దాడి కేసులో వడ్డెరకాలనీకి చెందిన ఐదుగురిని ఈ నెల 16 తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు. వీరిలో సతీష్ తప్ప మిగిలిన నలుగురు మైనర్లు. మూడు రోజుల విచారణ అనంతరం సతీష్ అరెస్టును గురువారం మధ్యాహ్నం చూపించారు. సీఎంపైకి సతీష్ రాయి విసిరినట్లు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. ఈ ఘటనకు ఏ2 సూత్రధారి అని చెబుతున్న పోలీసులు ఆ వ్యక్తి పేరును మాత్రం ఇందులో ప్రస్తావించలేదు.గులకరాయి కేసులో రిమాండ్ రిపోర్ట్ సాక్షిగా వైసీపీ కుట్రలు - టీడీపీ నేత పట్టాభి మీడియా సమావేశం
Last Updated : Apr 20, 2024, 12:42 PM IST