ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

"జగన్​ సర్కారు ఒక్కరోజులోనే రూ.2వేల కోట్ల స్కామ్​కు తెరలేపింది" - జగన్​ సర్కారు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 31, 2024, 6:38 PM IST

TDP Leader Pattabhi on YSRCP: వేల కోట్ల భూపందేరానికి ముఖ్యమంత్రి జగన్‌ శ్రీకారం చుట్టారని టీడీపీ నేత పట్టాభి ఆరోపించారు. జేఎస్‌డబ్ల్యూ న్యూ ఎనర్జీ కంపెనీకి 20,100 ఎకరాల భూమిని కట్టబెట్టారని విమర్శించారు. మెగావాట్‌కు మూడెకరాల నిబంధన మార్చి రెట్టింపు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్టుబడుల ముసుగులో సోలార్, పవన, పంపడ్ ఎనర్జీ పేరుతో జగన్ రెడ్డి, అనామక కంపెనీలకు వేలకోట్ల రూపాయల విలువజేసే భూములను పంచి పెడుతున్నారని ధ్వజమెత్తారు.

గతంలో అధికారంలో ప్రభుత్వాలు, సోలార్ విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు, ఒక్కో మెగావాట్ సోలార్ విద్యుత్ ఉత్పత్తికి 3 ఎకరాలు కేటాయించారని గుర్తు చేశారు. కానీ, జగన్ రెడ్డి దాన్ని ఏకంగా 6 ఎకరాలకు పెంచారని దుయ్యబట్టారు. మొత్తంగా జగన్ సర్కార్ సోలార్ పవర్​కు సంబంధించి, కేబినెట్ సమావేశం సాక్షిగా 23 వేల 500ఎకరాలు అదనపు భూ పందేరానికి తెరలేపారని విమర్శించారు. ఎకరం విలువ దాదాపు 10లక్షలు అనుకున్నా, జగన్ రెడ్డి సర్కార్  ఒక్కరోజులో సుమారు 2 వేల 350 కోట్ల భారీ స్కామ్​కు పూనుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్డగోలుగా నిబంధనలు మార్చి, చేసిన భూ కేటాయింపులపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమాధానం చెప్పాలని పట్టాభి డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details