LIVE జగన్ మోసం బయటపడుతుందనే చర్చకు రావడం లేదు- టీడీపీ నేత కేఎస్ జవహర్ మీడియా సమావేశం ప్రత్యక్ష ప్రసారం - కేఎస్ జవహర్ మీడియా సమావేశం
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 20, 2024, 1:13 PM IST
|Updated : Feb 20, 2024, 1:28 PM IST
TDP Leader KS Jawahar: అభివృద్ధిపై బహిరంగంగా చర్చకు రావాలని టీడీపీ అధినేత చంద్రబాబు విసిరిన సవాల్‌పై సీఎం జగన్ చర్చకు రాకపోవడంపై టీడీపీ నేతలు స్పందిస్తున్నారు. సంక్షేమంలో జగన్ ప్రభుత్వం మోసం బయటపడుతుందనే చర్చకు దూరంగా ఉంటున్నారని టీడీపీ నేత కేఎస్ జవహర్ మండిపడ్డారు. ఇదే అంశంపై ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
బూటకపు ప్రసంగాలు కాదు, అభివృద్ది పాలన ఎవరిదో, విధ్వంసం ఎవరిదో, చర్చించేందుకు దమ్ముంటే బహిరంగ చర్చకు రమ్మంటూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు (Chandrababu) సవాల్ విసిరారు. సామాజిక న్యాయానికి నిలువునా శిలువ వేసి బాదుడు పాలనతో ప్రజల రక్తం పీల్చేసి విధ్వంస పోకడలతో రాష్ట్ర భవిష్యత్‌ను కూల్చేసి ఇప్పుడు నువ్వు ర్యాంప్ వాక్ చేసి అబద్ధాలు చెబితే ప్రజలెలా నమ్ముతారు జగన్ రెడ్డీ అని చంద్రబాబు మండిపడ్డారు.
జగన్(Jagan)కు, ఆయన ప్రభుత్వానికి కౌంట్ డౌన్ ప్రారంభం అయ్యింది ఇంకా 50 రోజులేనని స్పష్టం చేశారు. రెక్కలు ఊడిపోయిన ఫ్యాన్‌ని విసిరిపారేయడానికి జనం సిద్ధంగా ఉన్నారన్నారు. వరం ఇచ్చిన శివుడినే బూడిద చేయాలనుకున్న భస్మాసురుడకి పట్టిన గతే జగన్‌కు పడుతుందని ధ్వజమెత్తారు. అబద్ధపు ప్రసంగాలు కాదు అభివృద్ది పాలన ఎవరిదో, విధ్వంసం ఎవరిదో, జనం ముందు చర్చిద్దాం దమ్ముంటే నాతో బహిరంగ చర్చకు రా అని సవాల్ చేశారు