ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

బీసీ సంక్షేమ పథకాల్లో వైసీపీ కోతలు- ఆత్మగౌరవాన్ని నిలబెట్టే పార్టీలకే ఓటు వేయాలి: కొలుసు పార్థసారథి - kolusu parthasarathy comments

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 17, 2024, 9:33 PM IST

TDP Leader Kolusu Parthasarathy Comments: వైసీపీ ప్రభుత్వం బీసీలకు తీవ్రంగా అన్యాయం చేసిందని మాజీ మంత్రి కొలుసు పార్థసారథి ధ్వజమెత్తారు. విజయవాడలో నిర్వహించిన యాదవ రాజుల ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలుగుదేశం నేత బొండా ఉమా ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బీసీలకు పొందాల్సిన సంక్షేమ పథకాలు సైతం వైసీపీ అటకెక్కించిందని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వస్తేనే బీసీల ఆత్మగౌరవం నిలదొక్కుకునే అవకాశాలు ఉన్నాయని పార్థసారథి చెప్పారు.

రాష్ట్రంలో అభివృద్ధి లేకుండా సంక్షేమం అమలు చేయలేమని అన్నారు. పారిశ్రామికంగా, వ్యవసాయ రంగంలో రాష్ట్రం అభివృద్ధి చెందాలని తెలిపారు. అయితే రాష్ట్రాభివృద్ధి కోసం ఈ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. దీని కారణంగా ప్రజలపై భారీగా పన్నుల భారంపడే ప్రమాదం ఉందన్నారు. బీసీలకు అందాల్సిన అనేక పథకాలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసిందని మండిపడ్డారు. ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే పరిస్థితులు ఏ పార్టీలో ఉన్నాయో ఒకసారి ప్రజలంతా ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు. 

ABOUT THE AUTHOR

...view details