LIVE: ఎన్నికలకు కూటమి యుద్ధభేరి - బొప్పూడిలో 'ప్రజాగళం' సభకు భారీగా ఏర్పాట్లు - ప్రత్యక్షప్రసారం - TDP Janasena BJP alliance
By ETV Bharat Andhra Pradesh Team
Published : Mar 17, 2024, 2:02 PM IST
|Updated : Mar 17, 2024, 2:08 PM IST
TDP Janasena BJP Alliance Prajagalam Sabha Live: చరిత్రలో నిలిచేలా చరిత్రను తిరగరాసేలా తెలుగుదేశ-జనసేన-బీజేపీ కూటమి తొలి బహిరంగ సభ ముస్తాబైంది. రాష్ట్ర రాజకీయ చరిత్ర గతినే మార్చేసే కీలక ఘట్టం బొప్పూడి వద్ద ఆవిష్కృతం కానుంది. వైసీపీ ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి రాష్ట్రానికి విముక్తి కల్పించేందుకు మూడు పార్టీలు చిలకలూరిపేట వేదికగా యుద్ధభేరి మోగించనున్నాయి. ప్రధాని నరేంద్ర మోదీ, తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పదేళ్ల తర్వాత ఒకే వేదికపైకి రానున్నారు. సార్వత్రిక సమరానికి ఆ త్రిమూర్తులు ఒకే వేదికపై నుంచి శంఖారావం పూరించనున్నారు. సభికులు అందరికి కనిపించేలా ప్రధానవేదికను ఎత్తులో ఏర్పాటుచేయడంతో వేదిక నుంచి జాతీయ రహదారి వరకు ప్రజలు ఎక్కడున్నా తిలకించే వెసులుబాటు కలగనుంది. సభలో మొత్తం 24 గ్యాలరీలు ఏర్పాటుచేశారు. ఆయా గ్యాలరీలకు రెండు వైపుల నుంచి వెళ్లేందుకు ప్రత్యేకంగా మార్గాలు ఉన్నాయి. వీటి అదనంగా వెనుక వైపు నిలబడేవారికి కొన్ని గ్యాలరీలు ఉన్నాయి. ఈ సందర్భంగా ప్రజాగళం సభ ప్రత్యక్షప్రసారం
Last Updated : Mar 17, 2024, 2:08 PM IST