'రాష్ట్రంలో విధ్వంస పాలనకు ముగింపు పలుకుదాం - మహాత్మాగాంధీకి అదే అసలైన నివాళి' - మహాత్మా గాంధీ వర్ధంతిపై చంద్రబాబు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jan 30, 2024, 12:29 PM IST
TDP Chief Chandrababu on Mahatma Gandhi Vardanthi: మహాత్మా గాంధీ వర్ధంతిని అమరవీరుల సంస్మరణ దినంగా పాటిస్తున్న సందర్భంగా మహోన్నత త్యాగాలు చేసిన దేశభక్తులను స్మరించుకుందామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. బ్రిటీష్ వారిని పారదోలేందుకు నాడు జాతిపిత అనుసరించిన బాటలోనే పోరాటం చేసి రాష్ట్రంలో విధ్వంస పాలనకు చరమగీతం పాడుదామని పిలుపునిచ్చారు. మంచికి మద్దతు పలుకుతూ రామరాజ్య స్థాపనకు మన వంతు కృషి చేయడమే జాతిపితకు మనమిచ్చే అసలైన, ఘనమైన నివాళి అని 'ఎక్స్(X)'లో పోస్ట్ చేశారు.
"మహాత్మా గాంధీ వర్ధంతిని అమరవీరుల సంస్మరణ దినంగా పాటిస్తున్న సందర్భంగా మహోన్నత త్యాగాలు చేసిన దేశభక్తులను స్మరించుకుందాం. బ్రిటిష్ వారిని పారదోలేందుకు నాడు జాతిపిత అనుసరించిన బాటలోనే పోరాటం చేసి రాష్ట్రంలో విధ్వంస పాలనకు చరమగీతం పాడుదాం. మంచికి మద్దతు పలుకుతూ రామరాజ్య స్థాపనకు మన వంతు కృషి చేయడమే జాతిపితకు మనమిచ్చే అసలైన, ఘనమైన నివాళి." - ఎక్స్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు పోస్ట్