కూటమి అధికారంలోకి రాకుంటే నాలుక కోసుకుంటా: బుద్దా వెంకన్న - Aaraa Mastan exit polls - AARAA MASTAN EXIT POLLS
By ETV Bharat Andhra Pradesh Team
Published : Jun 2, 2024, 7:48 PM IST
Aaraa Mastan exit polls survey: గతంలో ఎన్నడూ లేని విధంగా ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాల కోసం ప్రజలు ఎదురు చూశారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బుద్దా వెంకన్న వెల్లడించారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో వెంకన్న మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. వైఎస్సార్సీపీ నేతలు ఫేక్ సర్వేలతో టీడీపీ ఏజెంట్ల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఆరా మస్తాన్ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తెలుగుదేశం నేత బుద్దా వెంకన్న తప్పుబట్టారు. కచ్చితంగా కూటమి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ గెలుస్తుందని ఆరా మస్తాన్ తో సీఎం జగన్ అబద్ధం చెప్పించారని ఆరోపించారు. కూటమి అధికారంలోకి రాకుంటే తన నాలుక కోసుకుంటానని.. కూటమి గెలిస్తే ఆరా మస్తాన్ తన నాలుక కోసుకుంటారా అని బుద్దా వెంకన్న సవాల్ చేశారు. రేపు ఎన్నికలలో వైఎస్సార్సీపీ ఓడితే... ఇక జీవితంలో అసెంబ్లీలో అడుగు పెట్టను అని చెప్పే దమ్ము, ధైర్యం జగన్ కు ఉందా అని నిలదీశారు. నిన్న వచ్చిన సర్వేల్లో ఎక్కువ భాగం కూటమి అధికారం ఖాయంగా చెప్పాయన్నారు. బెట్టింగ్ లు కాయడానికి మైండ్ గేమ్ ఆడుతున్నారని బుద్దా వెంకన్న మండిపడ్డారు.