108 సూర్య నమస్కారాలతో లిమ్కాబుక్ , భారత్ బుక్ ఆఫ్ రికార్డ్స్ చోటు - 108 సార్లు సూర్య నమస్కారాలు
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 17, 2024, 11:41 AM IST
Surya Namaskar Record In Prakasam District : రథసప్తమి సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలు పెరేడ్ గ్రౌండ్స్‌లో విద్యార్థులు నిర్వహించిన సూర్యనమస్కారాలు అరుదైన రికార్డ్ నెలకొల్పారు. 3 వేల మంది విద్యార్థులు 108 సార్లు సూర్య నమస్కారాలు చేసి లిమ్కాబుక్ (Limcabook), భారత్ బుక్ ఆఫ్ రికార్డ్స్ (India Book of Records) లో చోటు దక్కించుకున్నారు. కలెక్టర్ ధినేష్ కుమార్ ఆధ్వర్యంలో, విద్యాశాఖ ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించారు.
108 Surya Namaskar Ratha Saptami Special By students : సుమారు గంటా 40 నిమిషాలు పాటు విద్యార్థులు (Students) సూర్య నమస్కారాలు చేశారు. 9 నెలలు సూర్యనమస్కారాలు సాధన చేశామని యోగా గురువు పతంజలి శ్రీనివాస్ (patanjali Srinivas) తెలిపారు. ఈ కార్యక్రమానికి వేగానంద యోగా విశ్వవిద్యాలం వైస్ ఛాన్సలర్ కంబంపాటి సుబ్రహ్మణ్యం జ్యూరీగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి జిల్లాలో పలు ప్రభుత్వ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.