40మందిని గాయపరిచిన వీధి కుక్కలు- బాధితులతో కర్నూలు ఆస్పత్రి కిటకిట - Dog Bite Cases In Kurnool - DOG BITE CASES IN KURNOOL
By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 1, 2024, 2:58 PM IST
Stray dog attack in Kurnool : కర్నూలులో వీధి కుక్కలు వీరంగం సృష్టించాయి. నగరంలోని 6,7 వార్డు పరిధిలోని చిత్తారి వీధిలో వీధికుక్కలు దాదాపు 35 నుంచి 40 మందిని గాయపరిచాయి. గాయపడిన వారిని వెంటనే చికిత్స కోసం కర్నూలు ఆసుపత్రికి తరలించారు.
వీధి కుక్కల నియంత్రణపై దృష్టి సారిస్తాం: టి.జి.భరత్ పరిస్థితిని అడిగి తెలుసుకున్న రాష్ట్ర మంత్రి టి.జి. భరత్ హుటాహుటిన అధికారులను వెంటబెట్టుకుని ఆసుపత్రికి వచ్చారు. బాధితులను పరామర్శించి వారికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులను ఆదేశించారు. దీంతో పాటు గాయపడిన వారికి పదివేల రూపాయల వరకు పరిహారం ప్రకటించారు. దీనిపై స్పందించిన మూగజీవుల ప్రేమికురాలైన మేనకా గాంధీ ఇలాంటి ఘటనలు మరలా పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపాలని భరత్‌ను ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. వీధి కుక్కల నివారణకు వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్లను చేయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ భాషా పాల్గొన్నారు.