ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

అంకిరెడ్డిపాలెం చెరువు అభివృద్ధి పనులను పరిశీలించిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీలక్ష్మి - Special Chief Secretary Srilakshmi

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 16, 2024, 1:50 PM IST

Special Chief Secretary Srilakshmi : గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని అంకిరెడ్డిపాలెం చెరువు అభివృద్ధి పనులను (Ankireddypalem Pond Development Works) ప్రభుత్వ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వై శ్రీలక్ష్మి సందర్శించారు. ఆంధ్రప్రదేశ్ గ్రీనరీ అండ్‌ బ్యూటిఫికేషన్‌ కార్పొరేషన్‌ (ఏపీజీబీసీ) నిధులతో చెరువు అభివృద్ధి పనులు త్వరలో పూర్తి చేసి ప్రారంభించనున్నట్లు ఆమె తెలిపారు. ప్రభుత్వం పర్యావరణ రహిత అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుందని పేర్కొన్నారు. ప్రతి గ్రామాలు, పట్టణాల్లో చెరువులను అభివృద్ది చేయటం ద్వారా ఆహ్లాదం, భూగర్భ జలాలు పెంపొందుతాయని తెలిపారు. అనంతరం అభివృద్ధి పనుల మ్యాప్‌ను పరిశీలించి మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని నగరపాలక సంస్థ అధికారులకు  శ్రీలక్ష్మి సూచించారు. 

వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు : అంకిరెడ్డిపాలెం చెరువును సుమారు 5.30 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నారు. చెరువు మధ్యలో మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌ రెడ్డి విగ్రహాన్ని ఏర్పాటు చేయటంతో తీవ్ర విమర్శలకు దారి తీస్తుంది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్‌ లేళ్ళ అప్పిరెడ్డి, ఏపీజీబీసీ ఎండీ రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details