'గౌస్‌నగర్' ఘటనలపై ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ ఆగ్రహం - సీఐ, ఐదుగురు ఎస్‌లకు ఛార్జ్ మెమోలు - Kadapa SP on Ghouse Nagar Incident - KADAPA SP ON GHOUSE NAGAR INCIDENT
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 18, 2024, 7:42 PM IST
SP Siddharth Kaushal Anger Over Kadapa Ghouse Nagar Incident: పోలింగ్ రోజుల కడప గౌస్‌నగర్‌లో జరిగిన అల్లర్లకు సంబంధించి జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలింగ్ ముగిసిన తర్వాత రాత్రి గౌస్‌నగర్‌లో టీడీపీ, వైఎస్సార్సీపీ వర్గాల మధ్య భారీ స్థాయిలో రాళ్లదాడి జరిగింది. ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాష సైతం వాహనం ఎక్కి తొడలు కొట్టి మీసం మేలేసి ప్రత్యర్థుల పైన కేకలు వేయడంతో పరిస్థితి ఉద్ధృతంగా మారింది. ఈ సమయంలో విధుల్లో ఉన్న పోలీసులు నిర్లక్ష్యంగా వహించారని ఎస్పీ సిద్ధార్థ కౌశల్ సంబంధిత పోలీసు అధికారులకు చార్జిమెమో జారీ చేశారు.
కడప వన్ టౌన్ సీఐ భాస్కర్ రెడ్డితోపాటు ఐదుగురు ఎస్ఐలకు ఛార్జ్ మెమోలు జారీ చేశారు. కడప వన్ టౌన్, టూ టౌన్ పోలీస్ స్టేషన్, రిమ్స్ పోలీస్ స్టేషన్లో ఎస్సైలుగా పనిచేస్తున్న ఐదుగురిపైన చార్జ్ మెమో జారీ చేసిన ఎస్పీ సిద్ధార్థ కౌశల్ వారందరి పైన శాఖ పరమైన విచారణకు ఆదేశించారు. శాఖా పరమైన విచారణ తర్వాత తీవ్రమైన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.