మోటార్ సైకిల్‌ల్లోకి దూరిన పాము - చాకచక్యంగా బయటకు తీసిన స్నేక్ క్యాచర్ - snake Found in Motorcycle
Published : Jan 27, 2024, 5:53 PM IST
Snake in Vehicle at Madhira : జనావాసాల్లోకి పాములు తరచూ రావడం చూస్తుంటాం కానీ ఓ పాము ఏకంగా మోటార్ సైకిల్‌ల్లోకి దూరింది. ఖమ్మం జిల్లా మధిర పట్టణంలో శాంతి థియేటర్ ఎదురుగా ఉన్న టైర్ల షాప్‌లోకి ప్రవేశించిన పాము, తర్వాత మోటార్ సైకిల్‌ల్లోకి దూరింది. ఇది గమనించిన వాహన యజమాని వెంటనే స్నేక్ క్యాచర్, జంతు ప్రేమికుడు ఆర్కే ఫౌండేషన్ ఛైర్మన్ దోర్నాల రామకృష్ణకు సమాచారమిచ్చాడు. రామకృష్ణ అతి చాకచక్యంగా పామును పట్టుకొని అడవిలో వదిలేశాడు.
Rescue of Cobra Trapped in Dambar : గత కొద్దికాలంగా పాములు జనావాసాల్లోకి వచ్చి ఇబ్బందులు పడుతున్నాయి. గత నెల ఓ నాగుపాము తారుడబ్బాలో పడి చావుబతుకుల మధ్య పోరాడింది. చివరకు స్నేక్ క్యాచర్ వచ్చి పామును రక్షించాడు. ఈ ఘటన కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడం వల్ల సోషల్ మీడియాలో పలువురు అభినందిస్తున్నారు. ఈ వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి.