ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఆధారాలన్నీ అందించాం- దాడి వెనకున్న మూల పురుషుడెవరో తేల్చాలి : నాని - SIT investigation Pulivarthi Nani - SIT INVESTIGATION PULIVARTHI NANI

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 20, 2024, 12:41 PM IST

SIT Team investigation On Pulivarthi Nani : వైఎస్సార్సీపీ నాయకులు తనపై సమ్మెటతో దాడి చేసినట్లు విజువల్స్‌ ఉన్నప్పటికీ వాళ్లు దాడి చేయలేదనడం విస్మయం కలిగిస్తోందని టీడీపీ నేత పులివర్తి నాని అన్నారు. పోలింగ్‌ తర్వాత తిరుపతిలో జరిగిన హింసాత్మక ఘటనలపై సిట్‌ అధికారులు నానితో మాట్లాడారు. ఆదివారం రాత్రి 9 గంటలకు నానిని స్టేషన్‌కి పిలిచిన అధికారులు రెండు గంటలకు పైగా విచారించారు. దాడిలో తనకు తగిలిన గాయాలను విచారణ సమయంలో పోలీసులకు నాని చూపించారు. కార్లకు అమర్చిన సీసీ టీవీ ఫుటేజీ, తదితర ఆధారాలను సిట్‌ అధికారులకు అందజేశారు. తనకి తప్పకుండా న్యాయం జరుగుతుందని నాని ఆశాభావం వ్యక్తం చేశారు. 

రాష్ట్రంలో పోలింగ్‌కు ముందు, ఆ తర్వాత జరిగిన హింసపై సిట్ ప్రాథమిక నివేదిక సిద్ధమైంది. కాసేపట్లో ప్రాథమిక నివేదికను ప్రత్యేక విచారణ బృందం డీజీపీకి అందించనుంది. తిరుపతి, పల్నాడు, అనంతపురం జిల్లాల్లో రెండ్రోజులపాటు సిట్ బృందం పర్యటించింది. పోలింగ్ రోజు జరిగిన అల్లర్లపై ఆరా తీసింది. శ్రీపద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆవరణలో చోటు చేసుకున్న ఘర్షణ కేసు వివరాలను పరిశీలించారు. చంద్రగిరి మండలం రామిరెడ్డిపల్లె, కూచివారిపల్లిలో విచారణ చేపట్టారు. 

ABOUT THE AUTHOR

...view details