ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

శ్రీరాంరెడ్డి తాగునీటి ఫథకం కార్మికుల సమ్మె - బకాయిలు చెల్లించాలని డిమాండ్​ - Workers Strike in Anantapur

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 13, 2024, 4:57 PM IST

Shri Ram Reddy Drinking Water Scheme Workers Strike in Anantapur District : అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం శ్రీరాం రెడ్డి తాగునీటి పథకం పంప్​ హౌస్​ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. గత నెలలో శ్రీరామ్​ తాగునీటి పథకం కార్మికులు వేతనాల బకాయిలు చెల్లించాలని ఆందోళన చేయగా అధికార నాయకులు నచ్చజెప్పి సమ్మె విరమించేలా చేశారు. ఇప్పుడు సంబంధిత కాంట్రాక్టర్ మారిపోయాడని, కొత్తగా వచ్చిన వ్యక్తి పాత బకాయిలతో తనకు సంబంధం లేదని చెబుతుండటంతో కార్మికులు తిరిగి సమ్మె బాట పట్టారు. 

కార్మికులు సమ్మెలో భాగంగా నియోజకవర్గంలో నీటి సరఫరా చేసే మోటార్లను ఆఫ్​ చేశారు. నీటి సరఫరా నిలిచిపోవడం వల్ల వైసీపీ నాయకులు పోలీసుల సహకారంతో మోటార్లను బలవంతంగా ఆన్​ చేసేందుకు యత్నించారు. దీంతో ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. కొత్త గుత్తేదారు మోటార్లను ఆన్​ చేసి నీటి సరఫరా ప్రారంభించగా, పంప్​ హౌస్​ నందు కార్మికులు బైఠాయించి నిరసనలు తెలిపారు. కార్మికులు సమ్మె విరమించకపోతేే విధుల నుంచి తొలగిస్తానని కాంట్రాక్టర్​ తెలిపారు. దీంతో ఆగ్రహించిన కార్మికులు మోటార్లను ఆఫ్​ చేశారు. ఈ నేపథ్యంలోనే పోలీసులు, కార్మికుల మధ్య తీవ్ర వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు కార్మికులకు సంఘీభావం వ్యక్తం చేశారు. తమకు రావాల్సిన బకాయిలతో పాటు పీఎఫ్​, ఈఎస్​ఐలు చెల్లించే వరకు సమ్మె కొనసాగిస్తామని సృష్టం చేశారు. 

ABOUT THE AUTHOR

...view details