ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

కోలాటాలు, థింసా నృత్యాలు- ఘనంగా ప్రారంభమైన సత్యసాయి అమృత సేవా దేవాలయం - సత్యసాయి అమృత సేవా ఆలయం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 25, 2024, 12:33 PM IST

Sathya Sai Amruta Seva Temple Opening at Gadugupalli: అల్లూరి జిల్లా హుకుంపేట మండలం గడుగుపల్లిలో శ్రీ సత్యసాయి అమృత సేవా దేవాలయం ప్రారంభ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. భజంత్రీలు, కోలాటాలు, థింసా నృత్యాల నడుమ వేదోచ్ఛారణతో గణపతి, షిర్డీ సాయిబాబా విగ్రహాలు ప్రారంభోత్సవం చేశారు. ముఖ్య అతిథులుగా సత్య సాయి సేవ సంస్థ మేనేజింగ్ ట్రస్టీ రత్నాకర్, అఖిలభారత సేవా సంస్థల అధ్యక్షుడు నిమీష్ పాండ్యా పాల్గొన్నారు. ఆలయ ప్రారంభ కార్యక్రమంలో వేలాది మంది సత్యసాయి భక్తులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా రత్నాకర్ మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో పలు అలవాట్లకు బానిసైనవారు సత్యసాయి కృపతో పూర్తిగా మారిపోయి పుట్టపర్తి వచ్చి స్వామి సేవలో తరిస్తున్నారని​ కొనియాడారు. పేదవారికి సహాయం చేయటం కోసమే ఈ సంస్థను స్థాపించారని రత్నాకర్ అన్నారు. ఈ ఏజెన్సీ ప్రాంతంలో సత్యసాయి తాగునీటి పథకాల వల్ల సురక్షితమైన నీరు అందుతుందని గుర్తు చేశారు. ఇక్కడ పరిస్థితులపై కేంద్ర ట్రైబల్ వెల్ఫేర్ మినిస్ట్రీకి తెలియజేస్తామని ఆయన పేర్కొన్నారు. సత్యసాయి దేవాలయం ఎక్కడ ఉన్నా అది ఒక దివ్య క్షేత్రం అవుతుందని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details