ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 27, 2024, 4:40 PM IST

ETV Bharat / videos

విజయవాడలో రైతు సంఘ నాయకుల ఆందోళన - రైతులను ఆదుకోవాలని వినతిపత్రాలు - Rythu Sangham Leaders Protest

Rythu Sangham Leaders Petition in MRO Office : వ్యవసాయ రంగ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ విజయవాడలో ఏపీ రైతు సంఘ నాయకులు ఆందోళనకు దిగారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిపోయిందని ఆరోపించారు. ఫలితంగా రైతులు చితికిపోయారన్నారు. కొత్తగా ఏర్పాటైన సర్కార్ వీటిపై దృష్టి సారించి గాడిలో పెట్టాలని అన్నారు. ఈ మేరకు వారు విజయవాడ గ్రామీణ తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రాలు అందజేశారు. 

కౌలు రైతులకు గుర్తింపు కార్డులు జారీ చేయాలని రైతు సంఘ నాయకులు డిమాండ్  చేశారు. అన్నదాతలకు పంట రుణాలు, పెట్టుబడి సాయం అందించాలని కోరారు. 90 శాతం సబ్సిడీతో అన్ని రకాల విత్తనాలు ఇప్పించాలని పేర్కొన్నారు. అదేవిధంగా గత సర్కార్ 2019లో తీసుకువచ్చిన పంట సాగదారుల హక్కుల చట్టాన్ని సవరించాలన్నారు.  పెండింగ్​లో ఉన్న ప్రాజెక్టులు, కాలువల నిర్మాణ పనులను పూర్తి చేయాలని అన్నారు. ప్రతి ఎకరాకి సాగు నీరు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని రైతు సంఘ నాయకులు కొత్త ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. 

ABOUT THE AUTHOR

...view details