ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

సున్నిపెంటలో అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు- వృద్ధురాలికి తీవ్రగాయాలు - RTC BUS accident - RTC BUS ACCIDENT

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 21, 2024, 3:57 PM IST

RTC Bus Hit A Old Woman at Bus Stand in Nandyal District : శ్రీశైలం మండలం సున్నిపెంటలో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. బస్టాండ్ ఆవరణలో  పిచ్చమ్మ అనే వృద్ధురాలిని ఢీ కొట్టింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం వృద్ధురాలి కాళ్లపైకి బస్సు టైర్లు ఎక్కాయి. ఆమె కుడికాలు పాదం నుజ్జు నుజ్జు అయ్యింది. గాయపడిన వృద్ధురాలిని స్థానికులు సున్నిపెంట ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బస్సు డ్రైవర్​ను పోలీసులు అదుపులోకి తీసుకొని , కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

ఒక్కసారిగా ఆర్టీసీ బస్సు వృద్ధురాలిపై దూసుకుపోవడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రమాదం జరిగిన వృద్ధురాలి బంధువులు కన్నీరు పెట్టుకున్నారు. నొప్పి భరించలేక వృద్ధురాలు పడుతున్న అవస్థ పలువురిని కన్నీరు పెట్టించింది. ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టాలని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డు ప్రమాదాలు ఇటీవల పెరిగి పోతున్నాయని కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ABOUT THE AUTHOR

...view details