ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

దోపిడి దొంగల బీభత్సం- హైవేపై వాహనాల్లో నిద్రిస్తున్న వారిపై దాడి - ROBBERY ATTACK - ROBBERY ATTACK

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jun 21, 2024, 1:31 PM IST

Robbery Attack in Sathya Sai District : శ్రీ సత్యసాయి జిల్లా సీకే పల్లి మండలం ఎన్ ఎస్ గేట్ సమీపంలో 44వ జాతీయ రహదారిపై తెల్లవారుజామున దొంగలు హల్​చల్​ చేశారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రహదారి పక్కన వాహనాలను ఆపి నిద్రిస్తున్న వారిపై దాడి చేశారు. తెలంగాణ రాష్ట్రం నుంచి స్కూలు బస్సులు కొనుగోలు చేసి బెంగళూరుకు తీసుకెళ్తున్నట్లు డ్రైవర్లు, సిబ్బంది నిద్ర వస్తుండడంతో సీకే పల్లి వద్ద జాతీయ రహదారి పక్కన వాహనాలను నిలిపి నిద్రపోయారు. 

ఆ సమయంలో డ్రైవర్లు సిబ్బందిపై దొంగలు దాడి చేశారు. దొంగల దాడిలో బస్సులోని ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా, మరికొందరికి స్వల్ప గాయాలు అయ్యాయి. మూడు స్కూల్ బస్సుల్లో ఉన్న డ్రైవర్ల అందరిపై దాడి చేసినట్లు తెలిపారు. బస్సులో అద్దాలపై రక్తపు మరకలు ఉన్నాయి. మరో బస్సు అద్దాలు ధ్వంసం చేశారు. గాయపడ్డ వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో అనంతపురం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details