ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

పెళ్లి ఇంట విషాదం - కుమారుడి పెళ్లికి ఆహ్వానించేందుకు వెళ్తుండగా ప్రమాదం - Road Accident - ROAD ACCIDENT

By ETV Bharat Andhra Pradesh Team

Published : Mar 25, 2024, 5:01 PM IST

Road Accident in YSR District : కుమారుడి పెళ్లి పత్రికలు పంచుతూ రోడ్డు ప్రమాదంలో తండ్రి మరణించిన సంఘటన వైఎస్సార్​ జిల్లాలో చోటుచేసుకుంది. ఒంటమిట్ట మండలం చెర్లోపల్లి వద్ద ఈ ఘెర రోడ్డు ప్రమాదం జరిగింది. కడప - చెన్నై ప్రధాన రహదారిలో చర్లపల్లి సమీపంలో ఇన్నోవా వాహనం ద్వి చక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ద్వి చక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇద్దరిలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరిని చికిత్స నిమిత్తం కడపకు తరలిస్తుండంగా మార్గమాధ్యంలో చనిపోయారు. మృతులు నడింపల్లెకు చెందిన రామచంద్రారెడ్డి, వెంకట సుబ్బారెడ్డిగా స్థానికులు గుర్తించారు.

ఇన్నోవా కారు అతివేగంగా వచ్చి ద్వి చక్ర వాహనాన్ని ఢీ కొట్టిందని స్థానికులు పేర్కొన్నారు. మరో మూడు రోజుల్లో రామచంద్రారెడ్డి కుమారుడి పెళ్లి పత్రికలు పంచే క్రమంలో ఈ ఘటన జరిగిందని కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్​కు తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఒంటిమిట్ట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details