LIVE : రాజ్యసభ సమావేశాలు - ప్రత్యక్షప్రసారం - Rajya Sabha Sessions Live - RAJYA SABHA SESSIONS LIVE
Published : Jul 1, 2024, 3:11 PM IST
|Updated : Jul 1, 2024, 6:02 PM IST
Rajya Sabha Sessions Live : గత వారం వాయిదా పడిన పార్లమెంట్ సమావేశాలు తిరిగి ఈరోజు ప్రారంభమయ్యాయి. మునుపటి సభల్లో నీట్ యూజీ-2024 (NEET UG-2024) పేపర్ లీకేజీ వ్యవహారం పార్లమెంట్ ఉభయసభల్లో అగ్గి రాజేస్తోంది. ఈ అంశంపై చర్చ జరపాలన్న విపక్షాల డిమాండ్ నేపథ్యంలో గందరగోళం తలెత్తిన విషయం తెలిసిందే. నేడు కొత్త న్యాయ చట్టాలపై చర్చలు జరుగుతున్నాయి. విపక్ష నేతలు అనవసర ఆరోపణలు చేస్తున్నారని కేంద్ర హోంశాఖమంత్రి అమిత్‌షా ధ్వజమెత్తారు. కొత్త చట్టాలతో త్వరగా న్యాయం జరుగుతుందని, ఈ అంశంపై పార్లమెంట్‌లోని సభ్యులతో చర్చించామని కొత్త న్యాయ చట్టాలు బాధితుల కేంద్రంగా తయారయ్యాయని పేర్కొన్నారు. కొత్త నేర చట్టాలు వల్ల నేర విచారణ వేగంగా జరుగుతుందని, నేర విచారణ నిర్దిష్ట సమయంలో పూర్తవుతుందని చట్టాలపై అభిప్రాయాలు చెప్పాలని ఎంపీలకు లేఖ రాశానన్నారు. చర్చలకు 16 గంటల సమయాన్ని కేటాయించారు. ప్రస్తుతం వాడీవేడీగా సాగుతున్న రాజ్యసభ సమావేశాలు ప్రత్యక్ష ప్రసారం మీకోసం.
Last Updated : Jul 1, 2024, 6:02 PM IST