ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

సినిమాలోనూ రాజధాని పేరు వింటే జగన్ ఉలిక్కిపడుతున్నారు: నారా లోకేశ్ - రాజధాని ఫైల్స్ సినిమా రివ్యూ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 17, 2024, 10:15 AM IST

Rajdhani Files Movie Review : రాజధాని ఫైల్స్ సినిమా ప్రదర్శనకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. రికార్డులను పరిశీలించిన న్యాయస్థానం సెంట్రల్ బోర్డాఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ జారీ చేసిన ధ్రువపత్రం సినిమాటోగ్రఫీ చట్ట నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయని ప్రాథమికంగా సంతృప్తి చెందినట్లు పేర్కొంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రదర్శనను తాత్కాలికంగా నిలిపివేస్తూ ఈనెల 15న జారీ చేసిన ఉత్తర్వులను పొడిగించలేమని తేల్చిచెప్పింది. ప్రతివాదులు మూడు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలంటూ విచారణను మార్చి 11కు వాయిదా వేసింది.

Nara Lokesh on Rajdhani Files Movie : రాజధాని ఫైల్స్ సినిమాను రాష్ట్ర హితం కాంక్షించే ప్రతి ఒక్కరు చూడాలని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పిలుపు నిచ్చారు. అమరావతి ఉద్యమాన్ని 150 నిముషాల వ్యవధిలో చిత్రీకరించడం అభినందనీయమన్నారు. చివరికి సినిమాలో కూడా రాజధాని పేరు వింటే జగన్ ఉలిక్కిపడుతున్నాడని నారా లోకేశ్ దుయ్యబట్టారు. హైకోర్టు ఆదేశాలతో సినిమా యథావిధిగా నడుస్తోందన్నారు. రైతుల త్యాగాలు, కష్టాలను తెరకెక్కించిన చిత్రానికి హైకోర్టు అండగా నిలబడిందని తెదేపా తిరుపతి పార్లమెంట్‍ అధ్యక్షుడు నరసింహ యాదవ్ అన్నారు. 

ABOUT THE AUTHOR

...view details