ఇంటి కోసం సామాన్యుడి ఆవేదన - 'తాగి వచ్చావా' అంటూ ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి ఆగ్రహం - YSR Aasara
By ETV Bharat Andhra Pradesh Team
Published : Feb 4, 2024, 9:34 AM IST
Protest to YSRCP MLA Topudurthi Prakash Reddy: శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం చంద్రచర్లలో రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డికి నిరసన సెగ తగిలింది. ఇల్లు మంజూరు విషయంలో శివయ్య అనే వ్యక్తి ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డిని నిలదీశారు. గ్రామంలో ఒకే వర్గానికి చెందినవారు రెండు, మూడు ఇళ్లు మంజూరు చేసుకుని, ఇంటికి ప్రహరీ గోడలు నిర్మించుకున్నారని ఆరోపించారు. తమకు మాత్రం ఇల్లు మంజూరు చేయలేదని, బోర్లు వేయించలేదని శివయ్య ప్రశ్నించారు.
దీంతో ఆగ్రహానికి గురైన తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి బోయ శివయ్యపై చిందులేశారు. 'తాగి వచ్చావా' అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతలో పోలీసులు అక్కడకు చేరుకుని శివయ్యను బలవంతంగా పంపించేశారు. అయితే శివయ్యకు ఎలాంటి చెడు అలవాట్లు లేవని గ్రామస్థులు తెలిపారు. కాగా రాప్తాడు నియోజకవర్గం కనగానపల్లి మండలం చంద్రచర్ల గ్రామానికి వైఎస్సార్ ఆసరా పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి హాజరయ్యారు. అదే గ్రామానికి చెందిన బోయ శివయ్య అనే వ్యక్తి కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యేను నిలదీశారు.