ఆంధ్రప్రదేశ్

andhra pradesh

విద్యార్థినులతో ప్రిన్సిపల్ అసభ్య ప్రవర్తన - దేహశుద్ధి చేసిన తల్లిదండ్రులు - Principal Harassment in Students

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 2, 2024, 1:26 PM IST

Updated : Aug 2, 2024, 1:34 PM IST

Principal Sexually Assaulted Students (ETV Bharat)

Anantapur Principal Sexually Assaulted Students : గురువు అంటే తండ్రిలాంటివాడు విద్యార్థులను కంటికి రెప్పలా చూసుకోవాలి. విద్యాబుద్ధులు నేర్పించి సమాజంలో ఉన్నతంగా తీర్చిదిద్దాలి. అలాంటిది కొందరు గాడి తప్పుతున్నారు. విద్యార్థినులపై కన్నేసి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారు. అభం, శుభం ఎరుగని పిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. విద్యాబుద్ధులు నేర్పించే పేరిట వక్రబుద్ధి ప్రదర్శిస్తున్నారు. తాజాగా అనంతపురం జిల్లాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.

School Principal Sexual Harassment Anantapur : అనంతపురంలోని ఓ ప్రైవేట్​ పాఠశాల ప్రిన్సిపల్ అంజనేయులు గౌడ్​పై లైంగిక ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడనే విషయం బయటకు వచ్చింది. ఇది తెలుసుకున్న పిల్లల తల్లిదండ్రులు స్కూల్ ముందు ధర్నా చేపట్టారు. ఈ క్రమంలోనే అంజనేయులు గౌడ్​కు దేహశుద్ధి చేశారు. దీంతో కాసేపు అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారికి సర్ది చెప్పి అతడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

Last Updated : Aug 2, 2024, 1:34 PM IST

ABOUT THE AUTHOR

...view details