కోనసీమ జిల్లాలో నిలిచిపోయిన పోలింగ్ - ఈవీఎంలు మొరాయించడంతో ఇంటిముఖం పట్టిన ఓటర్లు - AP Election Polling - AP ELECTION POLLING
By ETV Bharat Andhra Pradesh Team
Published : May 13, 2024, 7:52 PM IST
Polling Stopped Due to EVM Machines not Working: రాష్ట్రం ఓటెత్తింది. ఇవాళ ఉదయం 7 గంటల నుంచే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎండ వేడిమిని లెక్కచేయకుండా పలు చోట్ల దాడులకు వెరవకుండా ఓటరు తన తీర్పును నిక్షిప్తం చేశాడు. క్యూలైన్లలో బారులు తీరిన ఓటర్లు గంటల తరబడి వేచి చూసి మరీ ఓటు వేశారు. సాయంత్ర 5 గంటల వరకూ రాష్ట్రవ్యాప్తంగా 68.05 శాతం పోలింగ్ నమోదైంది.
అయితే అంబేడ్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలంలోని 223వ పోలింగ్ కేంద్రంలో సాయంత్రం 5గంటల నుంచి ఈవీఎం మిషన్లు మొరాయించడంతో పోలింగ్ నిలిచిపోయింది. అప్పటికే మూడు గంటల నుంచి క్యూలో వేచి ఉన్న, పోలింగ్ కేంద్రంలో ఉన్న ఓటర్లు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. పోలీసులు వచ్చి వారిని బయటికి పంపించేందు యత్నించారు. సాంకేతిక సిబ్బంది వచ్చి రిపేరు చేసేందుకు సమయం పడుతుండటంతో ఓటర్లు ఇంటిముఖం పట్టారు.