ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

నర్సు వేషంలో వచ్చిన మహిళా కిడ్నాపర్​- అర్థరాత్రి శిశువు అపహరణ - CHILD KIDNAPPING - CHILD KIDNAPPING

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jul 14, 2024, 11:26 AM IST

Police Cracked the Child Kidnapping Case : కృష్ణా జిల్లా మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో మగ శిశువును ఓ మహిళ ఎత్తుకెళ్లిన ఘటన కలకలం రేపింది. ఈ కేసును పోలీసులు గంటల వ్యవధిలోనే చేధించారు. పూర్తి వివరాలివీ. జిల్లాలోని శ్రీకాకుళం గ్రామానికి చెందిన స్వరూప రాణి అనే మహిళ కాన్పు‌ కోసం మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో చేరింది. మూడు రోజుల‌ క్రితం మగ శిశువుకు జన్మనిచ్చింది. 

గైనిక్ వార్డులో ఆదివారం రాత్రి 1:30 నిమిషాలకు నర్స్ వేషంలో ఇంగ్లిష్ పాలెంకి చెందిన లక్ష్మి అనే మహిళ శిశువును ఎత్తుకెళ్లింది. వెంటనే కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. స్పందించి రంగంలోకి దిగిన పోలీసులు శిశువు తీసుకెళ్లిన మహిళను సీసీ ఫుటేజ్ ద్వారా ఇంగ్లిష్ పాలెం వద్ద గుర్తించారు. గంటల వ్యవధిలో పోలీసులు బిడ్డను తల్లి వద్దకు చేర్చారు. నిందితురాలు ఇంగ్లిష్ పాలెంకు చెందిన లక్ష్మిగా పోలీసులు గుర్తించారు. మగ శిశువు తల్లిదండ్రులు పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details