వాహన తనిఖీల్లో పట్టుబడిన రూ.కోటి 31లక్షలు- ముగ్గురు అరెస్టు - Police Check Vehicles Seize Money - POLICE CHECK VEHICLES SEIZE MONEY
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 1, 2024, 8:00 PM IST
Police Checking of Vehicles Seized the Money in Tadipatri: అనంతపురం జిల్లా తాడిపత్రిలో పోలీసులు నిర్వహించిన వాహన తనిఖీల్లో రూ.31 లక్షల నగదును సీజ్ చేశారు. ఎటువంటి ఆధారాలు లేకుండా అక్రమంగా తరలిస్తున్నారని పోలీసులు తెలిపారు. ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. నగరంలో వాహనాలు తనిఖీలు (Vehicles Checking) చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుండటంతో తనిఖీలు చేయగా వారి వద్ద ఉన్న కోటి 35 లక్షల 31 వేల 750 రూపాయలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.
స్వాధీనం చేసుకున్న నగదును ఐటీ శాఖకు (Income Tax Department) అప్పగించినట్లు పోలీసులు స్పష్టం చేశారు. పట్టుబడిన ముగ్గురు వ్యక్తులు ఒకే కుటుంబానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వీరు కేరళ మహారాష్ట్ర నుంచి బంగారం తెచ్చి తాడిపత్రిలో అధిక ధరలకు విక్రయిస్తుంటారని పోలీసులు పేర్కొన్నారు. ఈ నగదుకు సంబంధించి వారి ఇంటి వద్ద తనిఖీలు చేయగా ఎలాంటి ఆధారాలు లభించలేదని పోలీసులు తెలిపారు. ఆ ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశామని సబ్ అడిషనల్ డీఎస్పీ వెల్లడించారు.