ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఫిరంగిపురంలో సీఎం జగన్​ పర్యటన - చెట్లు నరికేసిన అధికారులు - జగన్​ పర్యటన చెట్ల కొమ్మలు తొలగింపు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Feb 14, 2024, 3:31 PM IST

Phirangipuram Public Fire on CM Jagan Tour : సీఎం జగన్​ మోహన్​ రెడ్డి ఎక్కడ పర్యటిస్తే అక్కడ ఉండే చెట్లు మనుగడ లేకుండా పోతున్నాయని గుంటూరు జిల్లా వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫిరంగిపురంలో ఈ నెల 15న జరిగే వాలంటీర్ల వందనం కార్యక్రమానికి సీఎం జగన్​ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్​ హెలికాప్టర్​లో సెయింట్​ పాల్​ హైస్కూల్​లోని మైదానానికి చేరుకొని అక్కడ నుంచి బహిరంగ సభకు వెళ్లనున్నారు.

జగన్​ పర్యటనను దృష్టిలో పెట్టుకొని రహదారికి అడ్డుగా ఉన్నాయని చెట్ల కొమ్మలను తొలగించారు. ఇంత కాలం విద్యుత్​ తీగలను పట్టించుకోని అధికారులు సీఎం రాకతో హఠాత్తుగా సరి చేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. గుంటూరు - కర్నూలు జాతీయ రహదారిపై గుంతలు తవ్వి బారికేడ్లును ఏర్పాటు చేశారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇళ్లకు ఎదురుగా బారికేడ్లను అడ్డుగా పెట్టడం వల్ల బయటకు రావడానికి ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు.

ABOUT THE AUTHOR

...view details