ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఉపాధికల్పన శాఖ జేడీ నివాసంపై పెట్రోల్ సీసాలు విసిరిన దుండగులు - Petrol Attack On Chaitanya House - PETROL ATTACK ON CHAITANYA HOUSE

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 17, 2024, 6:18 PM IST

Petrol Attack On Chaitanya House : గుంటూరులో ఉపాధికల్పన శాఖ జాయింట్ డైరెక్టర్ చైతన్య ఇంటిపై దుండగులు పెట్రోల్‌ సీసాలతో దాడి చేశారు. విజయవాడలోని ఉపాధి కల్పన శాఖ కమిషనర్ కార్యాలయంలో పని చేసే చైతన్య గుంటూరులోని ఆకులవారితోటలో నివాసం ఉంటున్నారు. తెల్లవారుజామున 3 గంటలకు ఆయన ఇంటిపై దుండగులు పెట్రోల్ సీసాలు విసిరి నిప్పు పెట్టారు. పెద్దగా శబ్ధం రావటంతో ముందు గదిలో పడుకున్న చైతన్య కుమారుడు హర్షిత్ నిద్ర లేచారు.

అప్పటికే మంటలు వ్యాపించి కిటికీల్లో నుంచి పొగ లోపలకు రావటం మొదలైంది. వెంటనే కుటుంబసభ్యులంతా అప్రమత్తమై ఇంట్లో నుంచి బయటకు వచ్చారు. పైపుల ద్వారా నీళ్లు చల్లి మంటలు ఆర్పివేశారు. సమాచారం అందుకున్న పోలీసులు, క్లూస్ టీమ్‌తో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. జిల్లా ఎస్పీ బంగ్లాకు వెనుక వైపునే ఇలాంటి ఘటన జరగటం ఆందోళన రేకెత్తిస్తోంది. గంజాయి బ్యాచ్ ఈ పని చేసి ఉంటారని పలువురు అనుమానిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details