ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

విశాఖ తీరంలోని అక్రమ నిర్మాణాలపై తీసుకున్న చర్యలేంటి ?: హైకోర్టు - High Court on CRZ Constructions

By ETV Bharat Andhra Pradesh Team

Published : Aug 23, 2024, 10:49 PM IST

Petition in High Court on Constructions in Visakha CRZ Area: విశాఖ సీఆర్​జెడ్​ ప్రాంతంలో నిర్మాణాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని అధికారులను హైకోర్టు ప్రశ్నించింది. స్టేటస్ రిపోర్టును వెంటనే సమర్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. సీఆర్​జెడ్ (Coastal Regulation Zone) ప్రాంతంలో కాంక్రీట్ నిర్మాణాలు చేపడుతున్నా అదికారులు పట్టించుకోవడం లేదని జనసేన కార్పోరేటర్ పీతల మూర్తి యాదవ్ హైకోర్టులో పిటీషన్​ దాఖలు చేశారు. విశాఖ జిల్లా భీమునిపట్నం పరిధిలో సీఆర్​జెడ్ నిబంధనలను ఉల్లంఘించి జరుపుతున్న కాంక్రీట్ నిర్మాణాలపై హైకోర్టు విచారణ జరిపింది. సీఆర్​జెడ్ ప్రాంతంలో నిబధనలను ఉల్లంఘించి కాంక్రీట్ నిర్మాణాలు జరుగుతున్నాయని పిటీషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు .వెంటనే నివేదిక ఇవ్వాలని జీవీఎంసీ కమీషనర్, విశాఖ జిల్లా కలెక్టర్, భీమునిపట్నం తహశీల్దార్​కు న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. కేసు తదుపరి విచారణను న్యాయస్థానం రెండు వారాలకు వాయిదా వేసింది. సముద్రానికి అతి సమీపంలో జరుపుతున్న శాశ్వత నిర్మాణాలను తక్షణం నిలిపివేయాలని, దీనిపై వెంటనే నివేదిక ఇవ్వాలని గతంలోనే న్యాయస్థానం ఆదేశించింది.

ABOUT THE AUTHOR

...view details