ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

విశాఖలో దారుణం- రసాయనం చల్లి వ్యక్తికి నిప్పు- చికిత్స పొందుతూ మృతి - PERSON KILLED IN VISAKHAPATNAM - PERSON KILLED IN VISAKHAPATNAM

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 4, 2024, 12:40 PM IST

Person Killed In Visakhapatnam Sprayed Chemical And Set On Fire: అమ్మాయిలను ఆటపట్టించొద్దని బుద్ధి చెప్పినందుకు అతనిపై కక్షపెంచుకుని నిప్పంటించిన ఘటన విశాఖ జిల్లా భీమిలి బీచ్‌రోడ్డులోని చేపలుప్పాడలో చోటుచేసుకుంది. బాధితుడు చికిత్స పొందుతూ బుధవారం ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘాతుకానికి పాల్పడిన ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని రిమాండ్​కు తరలించామని భీమిలి సీఐ పేర్కొన్నారు. 

Person Stopped Girls Harassing: పార్వతీపురం మన్యం జిల్లా బత్తిలికి చెందిన చెప్పల నాగభూషణం అలియాస్‌ జాను (35) బతుకు తెరువు కోసం అయిదేళ్ల కిందట చేపలుప్పాడ ప్రాంతానికి వచ్చారు. బీచ్‌రోడ్డులోని ఐఎన్‌ఎస్‌ కళింగలో (INS Kalinga) సూపర్‌వైజరుగా పనిచేస్తూ చేపలుప్పాడ సమీపంలో చిన ఉప్పాడ గ్రామంలో భార్య, పిల్లలతో జీవిస్తున్నాడు. ఇటీవల తమ ఇంటికి సమీపంలో అమ్మాయిలను ఆట పట్టిస్తున్న పెద ఉప్పాడ, చిన ఉప్పాడ ఎస్సీకాలనీ, చేపల దిబ్బడిపాలెం గ్రామాలకు చెందిన ముగ్గురు యువకులను మందలించారు. దీంతో కక్ష పెంచుకున్న యువకులు  జాను ఇంటికి వెళ్లారు. జానును బయటకు పిలిచి అతడిపై టిన్నర్​ (రంగుల్లో కలపడానికి వినియోగించే మండే స్వభావం గల రసాయనం) జల్లి నిప్పంటించారు. తీవ్ర గాయాలైన జానును స్థానికులు కేజీహెచ్‌కి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం ప్రాణాలు కోల్పోయారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ పేర్కొన్నారు. ఇద్దరిని జువైనల్ హోమ్​కు, మరొకరిని సెంట్రల్ జైలుకు తరలించామని సీఐ వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details