ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఏం చేశారని ఓట్లు అడుగుతున్నారు ? - మేకపాటి రాజమోహన్‌రెడ్డిని ప్రశ్నించిన ప్రజలు - former mp Mekapati Rajamohan Reddy - FORMER MP MEKAPATI RAJAMOHAN REDDY

By ETV Bharat Andhra Pradesh Team

Published : Apr 23, 2024, 11:37 AM IST

People Fired on Mekapati Raja mohan Reddy at Chinamachanur: ఎన్నికల ప్రచారానికి వెళ్లిన వైఎస్సార్సీపీ మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌ రెడ్డికి నిరసన సెగ తగిలింది. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం చినమాచనూరులో మేకపాటి రాజమోహన్‌రెడ్డి కుమారుడు విక్రమ్‌రెడ్డి తరపున ఎన్నికల ప్రచారం (Election Campaign) సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మేకపాటి రాజమోహన్‌రెడ్డిని కదిరినేని పల్లి, పోలిరెడ్డి పల్లి గ్రామాల్లో ప్రజలు స్థానిక సమస్యల గురించి ప్రశ్నించారు.

Former MP Mekapati Election Campaign:  మా గ్రామాలకు ఏం చేశారని ఓట్లు అడుగుతున్నారంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సమస్యలే కాకుండా మండలం నుండి ఉదయగిరి రోడ్డు గుంతలమయంగా మారి నరకం అనుభవిస్తామంటూ మేకపాటి రాజమోహన్ రెడ్డిని ప్రజలు నిలదీశారు. ఉదయగిరికి వెళ్లే రోడ్డు చూశారా ఎంత అధ్వానంగా ఉందో అని ప్రశ్నిస్తూ స్థానికులు చుట్టుముట్టారు. స్థానిక వైఎస్సార్సీపీ నేతలు నచ్చచెప్పేందుకు ప్రయత్నించినా ప్రజలు వినకపోవడంతో రాజమోహన్‌రెడ్డికి అక్కడి నుంచి జారుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details