ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఆదోనిలో కలుషిత నీరు తాగి 30 మందికి అస్వస్థత- ఒకరి పరిస్థితి విషమం - Drinking Contaminated Water - DRINKING CONTAMINATED WATER

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 20, 2024, 12:35 PM IST

People Fell Illness After Drinking Contaminated Water in Adoni : కర్నూలు జిల్లా ఆదోని మండలం ఇస్వి గ్రామంలో కలుషిత నీరు తాగి 30 మంది అస్వస్థతకు గురయ్యారు. బాధితులను చికిత్స కోసం కుటుంబసభ్యులు ఆదోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. గ్రామంలో గత వారం రోజుల నుంచి తాగునీరు ఎర్ర రంగుతో వస్తున్నాయని బాధితులు పేర్కొన్నారు. 

మంచినీరు శుద్ధి చేయకుండానే అధికారులు సరఫరా చేస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రంగుమారిన నీరు తాగడంతోనే గ్రామంలో ఈ పరిస్థితి తలెత్తిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కలుషిత నీరు తాగి వాంతులు, విరోచనాలతో 30 మంది అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరారని గ్రామస్థులు వాపోయారు. రంగుమారిన తాగునీరు తాగి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అస్వస్థతకు గురయ్యారని స్థానికులు పేర్కొన్నారు. గ్రామంలో మంచి నీరు వదలి ప్రజల ఆరోగ్యాలు కాపాడాలని అధికారులను గ్రామస్థులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details