ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఏలూరు జిల్లాలో పులి సంచారం ! - భయాందోళనలో ప్రజలు

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 24, 2024, 6:10 PM IST

People Afraid That Tiger Will Roam: ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం, కొయ్యలగూడెం మండలాల్లో పులి సంచరిస్తోందని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పాదముద్రలను గుర్తించిన రైతులు అవి పులిగా భావిస్తున్నారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు 'ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్'​తో పాదముద్రలను సేకరించి వాటిని వైల్డ్ లైఫ్ ల్యాబ్​కు పంపించారు. అయితే కొయ్యలగూడెం, దిప్పకాయలపాడు , కొత్తూరు ప్రాంతాల్లో పులి సంచరించిందని, అక్కడ పాదముద్రలు గుర్తించామని స్థానికులు చెబుతున్నారు. తాజాగా అటవీ ప్రాంతంలో ఆవుని గుర్తు తెలియని జంతువు చంపేసిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. అటవీ శాఖ అధికారులు మాత్రం నామ మాత్రపు చర్యలతో చేతులు దులుపుకుంటున్నారని ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నాలుగు రోజుల క్రితం ఓ దూడ కూడా బలైపోయిందని స్థానికులు తెలిపారు. దాంతో ప్రజలు ఇంటి నుంచి బయటకు రావాలంటేనే భయంతో వణికిపోతున్నారు. వెంటనే అటవీ శాఖ అధికారులు ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసి జంతువు జాడని కనిపెట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు. 

ABOUT THE AUTHOR

...view details