ముస్లిం సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం : టీడీపీ నేత పయ్యావుల కేశవ్ - TDP Leader Payyavula Keshav - TDP LEADER PAYYAVULA KESHAV
By ETV Bharat Andhra Pradesh Team
Published : Apr 5, 2024, 12:45 PM IST
Payyavula Keshav Participated Iftar with Muslim Brothers in Anantapur District : అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణంలోని ముస్లింల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. గురువారం రాత్రి ఉరవకొండలోని ఆయా మసీదుల్లో ముస్లింలు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు. ముస్లింలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఉపవాస దీక్షలో ఉన్న ముస్లింల ప్రార్థనలు అనంతరం భోజనాన్ని వడ్డిస్తూ వారి ఐక్యతకు తన సంఘీభావాన్ని తెలిపారు.
ఉరవకొండ పట్టణంలోని ముస్లింల అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలను తయారు చేయించి, దానికి అనుగుణంగా తగిన చొరవ చూపుతామని పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే మరిన్ని పథకాలను తీసుకురానుందని ఈ సందర్భంగా తెలియజేశారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ అధిక మెజారిటీతో గెలుస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఆయన్ను ముస్లింలు ఘనంగా సత్కరించారు. ఆయా మసీదుల్లోని ఇఫ్తార్ విందుల్లో యువనాయకులు పయ్యావుల విక్రమ సింహ, విజయసింహ వేర్వేరుగా పాల్గొని ముస్లింలకు భోజనాన్ని వడ్డించారు.