ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

లడ్డూ నెయ్యి కల్తీ కాలేదని సుప్రీంకోర్టు చెప్పలేదు : ఉపముఖ్యమంత్రి పవన్‌ - Supreme Court On Laddu Issue - SUPREME COURT ON LADDU ISSUE

By ETV Bharat Andhra Pradesh Team

Published : Oct 1, 2024, 5:37 PM IST

Pawan Kalyan About Supreme Court Comments On Laddu Issue : లడ్డూ నెయ్యి కల్తీ కాలేదని సుప్రీంకోర్టు చెప్పలేదని ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు. విచారణ సమయానికి వారి దగ్గర ఉన్న సమాచారం ప్రకారం వారు (‌‌సుప్రీంకోర్టు న్యాయమార్తులు ) మాట్లాడారన్నారు. కేవలం తేదీ విషయంలోనే సందిగ్ధం ఉందన్నారు. దానిపై స్పష్టత ఇస్తామని తెలిపారు. ఒక్క లడ్డూ విషయంలోనే కాకుండా తిరుమలలో గత ఐదేళ్ల కాలంలో జరిగిన అనేక వివాదాలపైన మా ప్రభుత్వం దృష్టి సారిస్తుందన్నారు. ఐదేళ్లుగా తిరుమల కొండపైనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలపై జరిగిన దాడులకు ప్రాయశ్చిత్తంగానే తాను దీక్ష తీసుకున్నట్లు పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. వీటన్నింటిపై రేపు దీక్ష విరమణ తర్వాత డిక్లరేషన్‌ ప్రకటిస్తామని చెప్పారు.  

ప్రాయశ్చిత్త దీక్ష విరమించేందుకు ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ తిరుమలకు బయల్దేరారు. అలిపిరి పాదాల మండపం వద్ద పూజలు చేసిన అనంతరం కాలి నడకన తిరుమలకు పయనమయ్యారు. పవన్‌ రాకతో కూటమి నేతలు, జనసేన కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. దీంతో పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. బుధవారం ఉదయం పవన్‌ కల్యాణ్ శ్రీవారిని దర్శించుకుని ప్రాయశ్చిత్త దీక్ష విరమిస్తారు.

ABOUT THE AUTHOR

...view details