ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / videos

ఎవరైనా అల్లర్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదు : ఎస్పీ - SP Malika Garg instructions - SP MALIKA GARG INSTRUCTIONS

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 30, 2024, 10:37 PM IST

Updated : May 30, 2024, 10:44 PM IST

Palnadu SP Malika Garg instructions to People : ఓట్ల లెక్కింపు వేళ పల్నాడు జిల్లాలో ఎవరైనా అల్లర్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదని జిల్లా ఎస్పీ మలికా గార్గ్ అన్నారు. సార్వత్రిక ఎన్నికల రోజు, ఆ తర్వాత జరిగిన గొడవల కారణంగా పల్నాడు జిల్లా గురించి దేశంలోనే చెడుగా ప్రచారం జరుగుతోందని మలికా గార్గ్ తెలిపారు. పట్టణంలోని బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడుతూ పల్నాడు జిల్లాలో ఫ్యాక్షనిజం ఇంత తీవ్రంగా ఉందా అని తన స్నేహితులు, బంధువులు అడుగుతున్నారని తెలిపారు. కర్రలు, రాడ్లు చేతుల్లో పట్టుకుని తిరగడం, తలలు పగలగొట్టుకోవడం అవసరమా అని ప్రశ్నించారు. కేవలం పది రోజుల్లోనే పల్నాడు జిల్లాలో 160 కేసులు నమోదయ్యాయని, అలాగే 1200 మందిని అరెస్టు చేసినట్లు వివరించారు. 

ఇక్కడి జైళ్లు ఖాళీ లేక ఇతర జిల్లాల జైళ్లకు పంపించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. నాయకులు డబ్బు, తెలివితేటలతో బెయిల్ తెచ్చుకొని బయట ఉన్నారని వెల్లడించారు. అలాంటి వారి కోసం మీ జీవితాలు ఎందుకు నాశనం చేసుకోవాలో ఆలోచించాలని ప్రజలకు హితవు పలికారు. జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ అమలులో ఉందని తెలిపారు. దీన్ని ఉల్లంఘించి జిల్లాలో ప్రశాంతతకు భంగం కలిగిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇప్పుడు తాను కూడా పల్నాడు జిల్లా వాసినే అని, ఈ ప్రాంతానికి మంచి పేరు తేవాలన్నదే తన లక్ష్యమని ఎస్పీ మలికా గార్గ్ స్పష్టం చేశారు.  

Last Updated : May 30, 2024, 10:44 PM IST

ABOUT THE AUTHOR

...view details